: సీఎం తల తెగనరికి ఫుట్ బాల్ ఆడుకుంటానన్న బీజేపీ నేత అరెస్టు


కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తల తెగనరికి ఫుట్ బాల్ ఆడుకుంటానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. బీఫ్ తిన్నాడనే నెపంతో ఉత్తరప్రదేశ్ లో ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ, తానింత వరకు బీఫ్ తినలేదని, అయితే బీఫ్ తినాలనుకుంటే తననెవరూ ఆపలేరని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. తినాలనుకుంటే బీఫ్ మాత్రమే కాదు, పోర్క్ కూడా తింటానని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. దీనిపై షిమొగ బీజేపీ జిల్లా కార్యదర్శి ఎస్ఎన్ చెన్నబసప్ప మాట్లాడుతూ, ముఖ్యమంత్రికి దమ్ముంటే షిమెగ వచ్చి ఆవును చంపి తినాలని సవాలు విసిరారు. అలా చేస్తే ముఖ్యమంత్రి తల తెగనరికి, దానితో ఫుట్ బాల్ ఆడుకుంటానని ప్రకటించారు. సిద్ధరామయ్య చెబుతున్నది, చేస్తున్నది అంతా తప్పని చెన్నబసప్ప పేర్కొన్నారు. కాగా, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన కారణంగా చెన్నబసప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News