: ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.7,823 కోట్ల ఆదాయం వచ్చింది!: ద.మ.రైల్వే జీఎం


ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.7,823 కోట్ల ఆదాయం ఆర్జించామని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా తెలిపారు. అందులో సరుకు రవాణా ద్వారా రూ.5,509 కోట్లు, ప్రయాణికుల నుంచి రూ.1,958 కోట్లు వచ్చినట్టు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వీలైనంత త్వరగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. 2017, ఫిబ్రవరి నాటికి మేళ్లచెర్వు-విష్ణుపురం ప్రాజెక్టు; 2016, మార్చి నాటికి నంద్యాల-ఎర్రగుంట్ల పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని వివరించారు. ఏదేమైనా ప్రయాణికుల భద్రత, సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని గుప్తా చెప్పారు.

  • Loading...

More Telugu News