: మహేశ్ బాబు, ప్రకాశ్ రాజ్ బాటలో సుమన్


ప్రముఖ టాలీవుడ్ నటులు మహేశ్ బాబు, ప్రకాశ్ రాజ్ లు ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లాలో చెరో గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. తాజాగా మరో నటుడు సుమన్ కూడా వీరి బాట పట్టారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామి అయ్యేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో మహబూబ్ నగర్ జిల్లా మాడుగుల మండలం లోని సుద్దపల్లి గ్రామాన్ని ఆయన దత్తత తీసుకోబోతున్నారు. గ్రామాలను దత్తత తీసుకునేందుకు ప్రముఖులు ముందుకు రావాలని టీఎస్ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గ్రామాన్ని దత్తత తీసుకోవాలని సుమన్ నిర్ణయించారు.

  • Loading...

More Telugu News