: టామ్ హాంక్స్ పోలికల్లో బ్రిటన్ రాణి మట్టిప్రతిమ!


బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సుదీర్ఘకాలం పాలించిన రాణిగా ఇటీవల రెండో ఎలిజబెత్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, తాజాగా చైనీస్ కళాకారుడు డాపెంగ్ రూపొందించిన ఆమె మట్టిప్రతిమపై విమర్శలు వెల్లువెత్తాయి. 'లండన్ వింటర్ ఆర్ట్ అండ్ యాంటిక్ ఫెయిర్'లో గత నెలలో దాన్ని ప్రదర్శనకు ఉంచారు. అయితే ఈ ప్రతిమలో ఆమె మహారాణిలానే కనిపించడం లేదని, ప్రముఖ నటుడు టామ్ హాంక్స్ పోలికలతో ఉందని ఆర్ట్ క్రిటిక్ మార్క్ హడ్సన్ విమర్శించారు. తల వెనుక భాగం చాలా పెద్దగా ఉందని, బాక్సర్ గడ్డంతో చూసేందుకు టామ్ హాంక్స్ లా కనిపిస్తోందని అన్నారు. దాంతో రాణిగారి మట్టిప్రతిమ చర్చనీయాంశంగా మారింది. 20 కేజీల బరువున్న ఆ ప్రతిమ ముఖం కూడా చాలా మందంగా కనిపిస్తోందని, జుట్టు ఒక్కటే రాణి పోలికల్లో ఉందని మరికొంతమంది విమర్శకులు అంటున్నారు. వాస్తవానికి రాణి ప్రతిమ తయారు చేయడానికి కళాకారుడు డాపెంగ్ కు మూడు నెలలు పట్టిందట. 13 సార్లు మార్పులు చేర్పులు కూడా చేశాడు.

  • Loading...

More Telugu News