: పేలిన అగ్నిపర్వతం, చోటా రాజన్ తరలింపు ఆలస్యం!
ఇండోనేషియాలోని బాలీలో పట్టుబడిన అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ భారత తరలింపు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బాలీ సమీపంలో ఉన్న ఓ భారీ అగ్నిపర్వతం పేలి ఆకాశంలో దట్టమైన పొగలు వ్యాపించడంతో విమానాల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడటమే ఇందుకు కారణమని సమాచారం. తొలుత రాజన్ ను ఈ రాత్రికి భారత్ తీసుకురావాలని భావించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఇండియా నుంచి ముంబై, ఢిల్లీ పోలీసులు, సీబీఐ అధికారుల ప్రత్యేక బృందం కూడా అక్కడికి వెళ్లింది. పనులన్నీ ముగించి, ప్రభుత్వం నుంచి అనుమతులు పొంది, ఇక బయలుదేరడమే తరువాయి అనుకునే సమయంలో ఆటంకాలు ఏర్పడ్డాయి.