: షారుఖ్ పై సాధ్వి ప్రాచీ చేసిన వ్యాఖ్యలపై అపర్ణా సేన్ అభ్యంతరం
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ను ఓ పాకిస్థాన్ ఏజెంటుగా అభివర్ణించిన వీహెచ్ పీ నేత సాధ్వి ప్రాచీపై బాలీవుడ్ ప్రముఖుల స్పందనలు మొదలయ్యాయి. షారుఖ్ పై ప్రాచీ వ్యాఖ్యలను నమ్మలేకపోతున్నానని, ఇలాంటి వ్యాఖ్యలు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తాయని ప్రముఖ బాలీవుడ్ నటి, దర్శకురాలు, జాతీయ అవార్డు గ్రహీత అపర్ణా సేన్ ట్వీట్ చేశారు. దేశ సమగ్రతను దెబ్బతీసే వ్యాఖ్యలు చేసిన సాధ్వి ప్రాచీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. షారుఖ్ మాటను సమర్థించిన అపర్ణ... భావప్రకటన స్వేచ్ఛపై పెరిగిపోతున్న దాడులకు ఈ ఘటన ఒక నిదర్శనమని చెప్పారు. మత అసహనం, దాడులకు నిరసనగా భారత రాష్ట్రపతికి లేఖ ఇస్తానని తెలిపారు. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడే క్రమంలో అందరూ ఈ లేఖపై సంతకం చేయాలని ఆమె విన్నవించారు.