: తెలంగాణలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రసారాలను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశం


తెలంగాణ రాష్ట్రంలో నిలిచిపోయిన ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రసారాలను తక్షణమే పునరుద్ధరించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలనిచ్చింది. ఈ మేరకు కేంద్రం, తెలంగాణ ఎంఎస్ఓలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లకూ ఆదేశాల ప్రతులను పంచాలని, అవసరమైతే ఎంఎస్ఓలకు ప్రభుత్వమే రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. టీవీ9 చానల్ విషయంలో పాటించిన టీడీశాట్ ఆదేశాలను ఏబీఎన్ విషయంలోనూ అమలు చేయాలని స్పష్టం చేసింది. నేటివరకు ఏబీఎన్ ప్రసారాలు నిలిచిపోయి 506 రోజులు గడిచాయి. తాజాగా సుప్రీం తీర్పుతో ప్రసారాలు పునః ప్రసారం కానున్నాయి.

  • Loading...

More Telugu News