: భారత్ మార్కెట్లోకి ‘ఆన్’ సిరీస్ కొత్త స్మార్ట్ ఫోన్లు
సామ్ సంగ్ సంస్థ కొత్త తరహా 4జీ స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గెలాక్సీ ఆన్5, గెలాక్సీ ఆన్7 పేరుతో విడుదలైన ఈ కొత్త ఫోన్లు రెండు రంగులలో లభ్యమవుతున్నాయి. నలుపు, బంగారం రంగుల్లో లభిస్తున్న గెలాక్సీ ఆన్5 ధర రూ.8,990 కాగా, గెలాక్సీ ఆన్7 ధర రూ.10,990గా సంస్థ ప్రకటించింది. ఈ ఫోన్ల ఫీచర్లు... గెలాక్సీ ఆన్5 లో డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 5.1, 5 ఇంచ్ హెచ్‌డీ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, 1.2 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ ప్రాసెసర్, 1.5 జీబీ ర్యామ్, 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 2600 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి . గెలాక్సీ ఆన్7లో... డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 5.1, 5.5 ఇంచ్ హెచ్‌డీ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, 1.2 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ ప్రాసెసర్, 1.5 జీబీ ర్యామ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయి.