: చంద్రబాబు సర్కార్ పై బీజేపీ నేత కావూరి సంచలన వ్యాఖ్యలు
తెలుగుదేశం ప్రభుత్వంపై బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం రోజురోజుకూ బలహీనపడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రులు, ప్రజాప్రతినిధుల్లో అవినీతి పెరుగుతోందని ఆరోపించారు. రాజకీయ విలువలు దిగజారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ మధ్య కాలంలో టీడీపీపై బీజేపీ నేతల విమర్శలు పెరుగుతుండటం గమనార్హం.