: ప్యాంట్రీ కార్లను తొలగిస్తున్న రైల్వే శాఖ


24 గంటల కన్నా ఎక్కువ సేపు ప్రయాణించే రైళ్లలో ప్రయాణికుల ఆహార అవసరాలను తీర్చే ప్యాంట్రీ కార్లను దశలవారీగా తొలగించడానికి రైల్వే శాఖ కదిలింది. ఐఆర్ సీటీసీ ఆధ్వర్యంలో క్యాటరింగ్ సేవలు మొదలు కావడంతో, దూరప్రాంత రైళ్లలో అల్పాహార, భోజన సేవలందించే ప్యాంట్రీ బోగీలను తీసేస్తున్నట్టు అధికారి వెల్లడించారు. హౌరా - డెహ్రాడూన్ మధ్య తిరిగే ఉపాసన ఎక్స్ ప్రెస్, హౌరా - హరిద్వార్ కుంభ ఎక్స్ ప్రెస్ రైళ్లలో ప్యాంట్రీలను తొలగిస్తున్నట్టు ఉత్తర రైల్వే ప్రకటించింది. రైళ్లు ప్రయాణిస్తున్న మార్గాల్లో ఈ-కాటరింగ్ సేవల అందుబాటును పరిశీలించిన తరువాత, సమయానుకూలంగా అన్ని రకాల తినుబండారాలు, భోజనాలు లభిస్తాయని నిర్ధారించుకున్న మీదటే, ఆయా రైళ్లలో ప్యాంట్రీలు తొలగిస్తామని ఓ అధికారి వివరించారు.

  • Loading...

More Telugu News