: బీగీ డ్రెస్ లో సాక్షి... భజ్జీ రిసెప్షన్ లో సెంటరాఫ్ అట్రాక్షన్ గా ధోనీ భార్య
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మ్యారేజ్ రిసెప్షన్ లో ఓ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. మొన్న రాత్రి న్యూఢిల్లీలోని స్టార్ హోటల్ తాజ్ ప్యాలెస్ లో జరిగిన ఈ విందుకు ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పలు రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ జాబితాలో కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ దంపతులు కూడా ఉన్నారు. పెళ్లి తర్వాత ఫ్యాషన్ డ్రెస్సులకు వీడ్కోలు పలికిన ధోనీ సతీమణి సాక్షి సింగ్ మొన్న కొత్త లుక్కులో అదిరిపోయింది. బీగీ డ్రెస్ వేసుకుని వచ్చిన సాక్షి, భజ్జీ రిసెప్షన్ లో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. భజ్జీ దంపతులతో పాటు రిసెప్షన్ కు వచ్చిన వారితోనూ సాక్షి తన భర్తతో కలిసి వివిధ పోజుల్లో ఫొటోలు దిగింది.