: ఐపీఎల్ వల్ల స్లెడ్జింగ్ తగ్గింది: ధోనీ


ఐపీఎల్ కారణంగా క్రికెట్ లో స్లెడ్జింగ్ తగ్గిందని టీమిండియా వన్డే, టీట్వంటీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. మైదానంలో బ్యాట్స్ మన్ ఏకాగ్రతను దెబ్బతీసే క్రమంలో ప్రత్యర్థి జట్టు ఫీల్డర్లు స్లెడ్జింగ్ కి పాల్పడేవారని, ఐపీఎల్ రంగ ప్రవేశంతో వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లు స్నేహితులయ్యారని, స్నేహితులు కాని వారు కూడా స్నేహంగా మెలుగుతున్నారని, ఈ నేపథ్యంలో ఆటలో స్లెడ్జింగ్ తగ్గిందని అన్నాడు. ఆసీస్ క్రికెటర్లు స్లెడ్జింగ్ ఛాంపియన్లని, వారిలో చాలామంది ఆటగాళ్లకు భారత్ లో సన్నిహితులు ఉన్నారని ధోనీ చెప్పాడు. డ్రెస్సింగ్ రూంను వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లంతా పంచుకోవాల్సి వస్తుండడంతో అందరి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడిందని ధోనీ చెప్పాడు.

  • Loading...

More Telugu News