: బిచ్చగాడిని తన్నిన మధ్యప్రదేశ్ మంత్రి... సోషల్ మీడియాలో విమర్శలు


మధ్యప్రదేశ్ మంత్రి కుసుమ్ మొహద్లే నిర్వాకంపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పన్నా ప్రాంతంలో అట్టహాసంగా ఆమె స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టారు. రోడ్లు ఊడుస్తున్న సందర్భంగా ఓ యాచక టీనేజర్ ఆమెను యాచించాడు. అంతే... ఆమెలోను, ఆమె సిబ్బందిలోను కోపం కట్టలు తెంచుకుంది. సిబ్బంది అతడ్ని చితక్కొట్టగా, అతని తలపై ఆమె కాలితో తన్నారు. ఈ మొత్తం ఘటన వీడియోలో రికార్డయింది. ఈ సంఘటన చోటుచేసుకున్న సమయంలో అక్కడ జిల్లా కలెక్టర్, ఎస్పీ, బీఎస్పీ నేతలు, మీడియా ప్రతినిధులు ఉన్నారు. ఇది జాతీయ మీడియాలో ప్రసారం కావడంతో ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురుస్తున్నాయి.

  • Loading...

More Telugu News