: సీమాంధ్రులు ఓట్లు వేయకుండా చూడటానికే సంక్రాంతికి గ్రేటర్ ఎన్నికలు: మర్రి శశిధర్ రెడ్డి


జీహెచ్ఎంసీ ఎన్నికలు మరోసారి వాయిదా వేయించుకున్న తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆరోపణలు చేశారు. హైదరాబాద్ లో 35 శాతం ఉన్న సీమాంధ్రులు ఓట్లు వేయకుండా చూసేందుకే సంక్రాంతికి ఎన్నికలు పెట్టాలనుకుంటున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ కు ఇష్టం వచ్చినట్టు గ్రేటర్ వార్డుల విభజన చేశారని ఆరోపించారు. గ్రేటర్ ఓట్ల తొలగింపుపై ఈసీ నిర్ణయం తీసుకునే వరకు వార్డుల విభజన నోటిఫికేషన్ ఆపాలని కోరారు. కో-ఆప్టెడ్ సభ్యులను నియమించుకోవడం కుదరదన్న కారణంతో వార్డుల సంఖ్య పెంపుపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందని తెలిపారు. కాబట్టి జనాభాకు తగ్గట్టు వార్డుల సంఖ్య పెంచాలని మర్రి డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News