: కేసీఆర్ అయుత చండీయాగానికి మొదలైన ఏర్పాట్లు


ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్ లో తలపెట్టిన అయుత చండీయాగానికి ఏర్పాటు ప్రారంభమయ్యాయి. మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలోని ముప్పై ఎకరాలకుపైగా భూమిని చదునుచేసే పనులు మొదలెట్టారు. యాగశాల నిర్మాణం, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రుత్విక్ లు ఉండేందుకు ప్రత్యేకంగా గుడారాలు ఏర్పాటు చేయనున్నారు. డిసెంబర్ 23 నుంచి 27 వరకు జరిగే యాగానికి తెలంగాణ, ఏపీ, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి 1,100 మందికిపైగా రుత్వికులను ఆహ్వానిస్తున్నారు. శృంగేరీ పిఠాధిపతినీ ఆహ్వానిస్తున్నారు. శృంగేరీ పీఠాధిపతి శిష్యులు, కరీంనగర్ జిల్లాకు చెందిన పురాణం మహేశ్వర శర్మ, గోపీకృష్ణ, కర్నూలుకు చెందిన ఫణిశశాంక తదితరులు యాగ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. యాగానికి అవసరమైన ఇతర ఏర్పాట్లను టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇతరులకు అప్పగించారు. ఇప్పటికే వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కేసీఆర్ ఇవాళ అక్కడి పంటలను పరిశీలిస్తారు. తరువాత చండీయాగం ఏర్పాట్లను కూడా పరిశీలించనున్నారు.

  • Loading...

More Telugu News