: వోడాఫోన్ సైట్ పై సైబర్ దాడి... కస్టమర్ల సమాచారం హ్యాక్


బ్రిటన్ లో ప్రముఖ టెలిఫోన్ ఆపరేటర్ గా ఉన్న వోడాఫోన్ సంస్థ వెబ్ సైట్ పై మరోసారి సైబర్ దాడి జరిగింది. 2వేల మందికి పైగా వినియోగదారుల అకౌంట్లు హ్యాకింగ్ కు గురయ్యాయి. కొన్ని రోజుల కిందట జరిగిన సైబర్ దాడిలో వినియోగదారులకు చెందిన బ్యాంక్ ఖాతా నంబర్లు, టెలిఫోన్ నంబర్లు, వారి పేర్లు వంటి తదితర వివరాలను హ్యాకర్లు యాక్సెస్ చేసుకున్నారని వొడాఫోన్ ప్రతినిధులు తెలిపారు. గుర్తు తెలియని ప్రదేశం నుంచి వినియోగదారుల ఈ-మెయిల్స్, పాస్ వర్డ్ లతో లాగిన్ అయ్యారని పేర్కొన్నారు. అయితే వారి క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు మాత్రం సేఫ్ గా ఉన్నాయని చెప్పారు. ఈ విషయంపై తమ వినియోగదారులను సంప్రదిస్తున్నామన్నారు.

  • Loading...

More Telugu News