: ఫ్లెక్సీల్లో ‘అన్న’ ఫొటో లేదు!... ఆవేదనతో అజ్ఞాతంలోకి వెళ్లిన ‘ఎర్రోళ్ల’


తెలంగాణలో ఎక్కడ, ఎప్పుడు, ఏ తరహా ఎన్నికలు జరిగినా... టీఆర్ఎస్ తురుపు ముక్క తన్నీరు హరీశ్ రావే. ఈ విషయం ఇప్పటికే పలుమార్లు రుజువైపోయింది. హరీశ్ రావు వచ్చాడంటే జనం ఆయన వెంటే. తన సొంత నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా, తనను పలకరించే జనాలను పేరు పెట్టి పిలిచే గొప్ప మనసు, అద్భుత జ్ఞాపక శక్తి ఆయన సొంతం. ప్రస్తుతం వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక మిగతా పార్టీలకు ఎలా ఉన్నా, టీఆర్ఎస్ కు మాత్రం అత్యంత ప్రతిష్ఠాత్మకం. ఈ నేపథ్యంలోనే ‘గెలుపు సారథి’గా పేరుపడ్డ హరీశ్ రావును ఎన్నికల ఇంచార్జీగా కేసీఆర్ నియమించారు. అయితే రెండు రోజులు గడవకముందే పార్లమెంట్ పరిధిలోని వరంగల్ తూర్పు అసెంబ్లీకి హరీశ్ ను పరిమితం చేసిన కేసీఆర్, మిగిలిన ఆరు అసెంబ్లీలకు ఆరుగురు మంత్రులను ఇంచార్జీలుగా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో కినుక వహించిన హరీశ్ ఆ ఎన్నికపై అంతగా దృష్టి పెట్టడం లేదు. ఓపక్క హరీశ్ ప్రాధాన్యాన్ని కేసీఆర్ తగ్గించగా, మరోపక్క వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ నేతలు ఫ్లెక్సీల్లో ఏకంగా హరీశ్ ఫొటోకే చోటివ్వడం లేదట. దీంతో హరీశ్ రావు అనుచరవర్గం కూడా దాదాపుగా ఎన్నికలకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఇందులో భాగంగా వరంగల్ లో పార్టీకి కీలక నేతగానే కాక ఉద్యమానికి సరికొత్త జవసత్వాలను నింపిన యువనేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఏకంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తనను సంప్రదించే నేతలకు అందుబాటులో ఉండకూడదన్న భావనతో ఎర్రోళ్ల ఏకంగా తన సెల్ ఫోన్ ను కూడా స్విచ్ఛాఫ్ చేసేసుకున్నారట.

  • Loading...

More Telugu News