: చంద్రబాబు కాన్వాయ్ కుదింపు...అంబులెన్స్ కూడా ఉపసంహరించే యోచన
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్ లో మార్పులు జరిగాయి. ఇప్పటి వరకు చంద్రబాబు విజయవాడ వచ్చినప్పుడు ఆయనకు ఉన్న ప్రొటోకాల్ మేరకు కాన్వాయ్ లో 23 వాహనాలను ఉంచారు. అయితే, చంద్రబాబు విజయవాడలోనే ఉంటుండటం, కరకట్ట వద్ద నివాసం కూడా ఏర్పాటు చేసుకోవడంతో... ఆయన కాన్వాయ్ ను 23 నుంచి తొమ్మిదికి తగ్గించారు. కాన్వాయ్ లోని అంబులెన్స్ ను కూడా ఉపసంహరించే ఆలోచనలో ఉన్నారు. చంద్రబాబు అస్వస్థతకు గురైతే విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రి లేదా వారధి అవతల ఉన్న మణిపాల్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకునేలా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి ఉన్న చోట నుంచి ఈ ఆసుపత్రులకు పది నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈ కారణంగానే కాన్వాయ్ లో అంబులెన్స్ అవసరం లేదనే నిర్ణయానికి వచ్చారు.