: చెన్నైలో కుండపోత వర్షం... విద్యాలయాలకు సెలవు ప్రకటించిన తమిళ సర్కారు


బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ పొరుగు రాష్ట్రం తమిళనాడు రాజధాని చెన్నైలో మాత్రం వరుణుడు బీభత్సం సృష్టించాడు. 24 గంటలకు పైగా చెన్నైలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. ఫలితంగా నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు కూలి రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షపాతం నమోదైంది. వర్ష బీభత్సంపై నిన్న సాయంత్రమే సీఎం జయలలిత అత్యవసర భేటీ నిర్వహించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ఆమె అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలలకు సోమవారం సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది.

  • Loading...

More Telugu News