: ములుకుదురు చేరిన ఏపీ సీఎం


రెండో విడత 'మీ ఇంటికి - మీ భూమి' కార్యక్రమం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం గుంటూరు జిల్లా, పొన్నూరు మండలం ములుకుదురు గ్రామానికి చేరుకున్నారు. అప్పటికే గ్రామానికి చేరిన ఏపీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్ బాబులతో పాటు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ లు చంద్రబాబుకు స్వాగతం పలికారు. మరికాసేపట్లో గ్రామస్తులతో సమావేశమయ్యే చంద్రబాబు 'మీ ఇంటికి - మీ భూమి' కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం వారి సమస్యల గురించి అడిగి తెలుసుకోనున్నారు.

  • Loading...

More Telugu News