: పాక్ క్రికెటర్ పై అనుచిత వ్యాఖ్యలు, భారత మోడల్ పై ఫత్వా!


పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిదిపై అనుచిత వ్యాఖ్యలు చేసిందని ఆరోపిస్తూ, ప్రముఖ మోడల్ ఆర్షీ ఖాన్ పై పాక్ లోని ఓ ముస్లిం మతపెద్ద ఫత్వాను జారీ చేశారు. ఆమె ఇస్లాం మతాచారాలను అవమానించిందని కూడా ఆయన ఆరోపించారు. కాగా, ఆగస్టు 31న " నేను అఫ్రీదితో డేటింగ్ చేయడం లేదు. మేము మంచి స్నేహితులం. కొన్నిసార్లు కలుసుకున్నాం. అంతే" అని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించిన ఆర్షీ ఖాన్, ఆపై సెప్టెంబర్ 8న "అవును, నేను అఫ్రీది లైంగికంగా దగ్గరయ్యాం. నేను ఎవరితోనైనా కలసి నిద్రించేందుకు భారత మీడియా అనుమతి కావాలా? ఇది నా వ్యక్తిగత జీవితం. నాకు సంబంధించినంత వరకూ ఇది ప్రేమ" అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా ఆమె అఫ్రీదితో ఉన్న తన అనుబంధంపై కొన్ని ఇంటర్వ్యూల్లో ప్రస్తావించింది.

  • Loading...

More Telugu News