: తొలుత శాంతి నెలకొల్పితే, ఆపై ఇండియా పరుగులు చూడొచ్చు: మోదీకి ఇన్ఫోసిస్ మూర్తి సలహా


తమపై దాడులు పెరుగుతున్నాయని ఇండియాలోని మైనారిటీల్లో భయాందోళనలు అధికమవుతున్నాయని, ముందుగా వాటిని తొలగించే చర్యలు చేపట్టాలని ప్రధాని మోదీకి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి సలహా ఇచ్చారు. మైనారిటీలు, దళితులపై అసహనాన్ని ప్రదర్శిస్తూ, చేస్తున్న దాడుల సంఖ్య పెరగడం తగదని అభిప్రాయపడ్డ ఆయన, ముందుగా దేశంలో శాంతిని నెలకొల్పాలని, తదుపరి వృద్ధి దిశగా ఇండియా దానంతట అదే పరుగులు పెడుతుందని వివరించారు. ముఖ్యంగా దాడులకు గురవుతున్న వారి మనసుల్లో ఉన్న భయాలను తొలగించేలా కేంద్రం చర్యలు చేపట్టాలని, ఇది జరగకుంటే, ఆర్థిక వృద్ధి క్లిష్టతరమవుతుందని తెలిపారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మైనారిటీ వర్గాల్లో నమ్మకం కోల్పోకుండా ఉండటం తప్పనిసరని వివరించారు. ఈ సందర్భంగా 1967 నాటి ఘటనలు గుర్తు తెచ్చుకుంటూ, అప్పట్లో దక్షిణాది వారిని శివసేన చిన్న చూపు చూసిందని తెలిపారు. అప్పట్లో పెను రాద్ధాంతంగా మారిన ఈ వ్యవహారం ఓ కొలిక్కి రావడానికి చాలా కాలం పట్టిందని అన్నారు. పేదరికాన్ని రూపుమాపేందుకు కృషి చేయాల్సిన ప్రభుత్వాలు ఓ వర్గం వారు మరో వర్గం వారిపై చేస్తున్న దాడులను ప్రోత్సహిస్తున్నాయన్న అనుమానాలను పెంచేలా వ్యవహరిస్తుండటం దేశానికి నష్టం కలిగించే అంశమని నారాయణమూర్తి హితవు పలికారు.

  • Loading...

More Telugu News