: తెలంగాణలో 'రమ్మీ'కి తిరుగులేదు... క్లబ్బులను అడ్డుకోవద్దన్న హైకోర్టు


తెలంగాణలోని క్లబ్బుల్లో పేకాట కొనసాగవచ్చని, పందెం ఎంతైనప్పటికీ, పోలీసులు జోక్యం చేసుకోరాదని హైకోర్టు ఆదేశించింది. 13 ముక్కలాట (రమ్మీ) నైపుణ్యానికి సంబంధించిన ఆటని ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, క్లబ్బుల్లో రమ్మీ ఆడుతుంటే పోలీసుల జోక్యం ఏంటని ప్రశ్నిస్తూ, వివిధ క్లబ్బుల యాజమాన్యం కోర్టును ఆశ్రయించగా, విచారించిన జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి తీర్పిచ్చారు. అయితే, క్లబ్బుల్లో సీసీ కెమెరాలు పెట్టాలని, కనీసం 15 రోజుల రికార్డులు భద్రపరచాలని ఆయన ఆదేశించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, ఎన్.హరినాథ్‌ రెడ్డిలు తమ వాదనలు వినిపించారు.

  • Loading...

More Telugu News