: సిబ్బంది అతి విశ్వాసమే కొంపముంచింది!
సినాయి పర్వతం ప్రాంతంలో రష్యాకు చెందిన విమానం కూలిపోవడానికి కారణం విమాన సిబ్బంది అతి విశ్వాసమేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. విమాన ప్రమాదం సంభవించిన వెంటనే ఈజిప్టు అధికారులు స్పందించి, హుటాహుటీన భద్రతా బలగాలను సహాయక చర్యల నిమిత్తం పంపాయి. క్షతగాత్రులను రక్షించేందుకు 45 అంబులెన్స్ లు పంపారు. శకలాల్లో చిక్కుకున్న మృత దేహాలను తొలగిస్తూ, విమానం బ్లాక్ బాక్స్ గురించి అధికారులు గాలింపు చేపట్టారు. వారి గాలింపు ఫలించి బ్లాక్ బాక్స్ లభ్యమైంది. కాగా, విమానంలో సాంకేతిక లోపం ఉందని టేకాఫ్ కు ముందే సిబ్బంది గుర్తించినట్టు నిపుణులు భావిస్తున్నారు. అయితే సిబ్బంది అతి విశ్వాసంతో విమానం టేకాఫ్ తీసుకుందని, దీంతో కొగల్మావియా ఎయిర్ లైన్స్ పై రష్యా ప్రభుత్వం కేసు నమోదు చేసింది. దీనిపై మరింత అధికారిక సమాచారం అందాల్సి ఉంది.