: సోమేశ్ కుమార్ ను బదిలీ చేయడం కాదు... విధుల నుంచి తొలగించాలి: మర్రి శశిధర్ రెడ్డి


జీహెచ్ఎంసీ పరిధిలో ఓట్ల తొలగింపు నేపథ్యంలో మాజీ కమిషనర్ సోమేశ్ కుమార్ పై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి మండిపడుతున్నారు. ఓట్ల తొలగింపుకు కారణమైన సోమేశ్ ను పాతరేస్తామని హెచ్చరించారు. ఆయనతో పాటు ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్ పై కూడా చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ, సోమేశ్ ను వేరే శాఖకు బదిలీ చేయడం కాకుండా వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కావాలనే సోమేశ్ ను అడ్డం పెట్టుకుని ఓటర్లను తొలగించారని శశిధర్ రెడ్డి విమర్శించారు. ఓట్ల తొలగింపుపై కేంద్ర ఎన్నికల బృందానికి అన్ని ఆధారాలు సమర్పించామని తెలిపారు. ఒక్క సనత్ నగర్ నియోజకవర్గంలో 25వేల ఓట్లు తొలగించడం దుర్మార్గమని, అందుకు సంబంధించిన ఆధారాలను జీహెచ్ఎంసీ నుంచి తానే తస్కరించానని చెప్పారు. ఈ విషయంలో దమ్ముంటే తనపై చర్యలు తీసుకువాలని ఆయన ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News