: మరో టైటిల్ కు అడుగు దూరంలో సానియా జోడీ


భారత్-స్విస్ మహిళా టెన్నిస్ జోడీ మరో టైటిల్ కు అడుగు దూరంలో నిలిచింది. సింగపూర్ లో జరుగుతున్న డబ్ల్యూటీయే టోర్నీ సెమీ ఫైనల్ లో సానియా-హింగిస్ జోడీ 6-4, 6-2 తేడాతో చైనీస్ తైపీ జంట హావో చింగ్ చాన్-యుంగ్ జాన్ చిన్ పై గెలుపొందారు. సానియా-హింగిస్ జోడీని తొలి సెట్ లో తీవ్రంగా ప్రతిఘటించిన చింగ్ చాన్- జాన్ చిన్ రెండో సెట్ లో చేతులెత్తేశారు. దీంతో సానియా-హింగిస్ జోడీ ఫైనల్ కు చేరింది. ఎనిమిది నెలల క్రితం హింగీస్ తో జతకట్టిన సానియా మీర్జా వింబుల్డన్, యూఎస్ ఓపెన్ సహా ఎనిమిది డబుల్స్ టైటిల్స్ నెగ్గింది. ఫైనల్స్ చేరిన ఈ జోడీ, ఇంకొక్క విజయం సాధిస్తే ఈ ఏడాది డబ్ల్యూటీఏ షెడ్యూలును విజయవంతంగా ముగించినట్టు అవుతుంది. ఇప్పటికే నెంబర్ వన్ జోడీగా ఉన్న వీరి జంట మరిన్ని పాయింట్లతో కొత్త షెడ్యూల్ లోకి అడుగు పెట్టనుంది.

  • Loading...

More Telugu News