: సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ కొనేవారు గుర్తుంచుకోవాల్సిన 7 అంశాలు


మీరు సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? తక్కువ ధరకే మంచి ఫోన్ వస్తోందని ఆనందపడిపోతున్నారా? మంచిదే... కానీ, కొనే ముందు ఈ 7 అంశాలను చెక్ చేసుకోండి. 1. ఫోన్ తో పాటు బిల్లు, బాక్స్, యాక్సెసరీస్ ను అడిగి తీసుకోండి. దీనివల్ల అవసరమైనప్పుడు మళ్లీ అమ్మడం లేదా రీప్లేస్ చేసుకోవడం వీలవుతుంది. యాపిల్ కంపెనీకి రెండేళ్ల వరకు కొన్ని ఆఫర్లు ఉంటాయి. ఐఎంఈఐ నెంబర్ చెక్ చేసుకోవడానికి బాక్స్ ఉపయోగపడుతుంది. 2. కనీసం 2జీబీ ర్యామ్ ఉండేలా చూసుకోవాలి. 3. ఫోన్ దొంగలించబడిందా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. అందుకే ఫోన్ బాక్స్ అడగాలి. దొంగలించిన ఫోన్ కు బాక్స్ ఉండే అవకాశాలు చాలా తక్కువ. బాక్స్ లేకపోతే *#06# కి డయల్ చేసి ఐఎంఈఐ నెంబర్ చెక్ చేసుకోవాలి. అనంతరం 'IMEIdetective.com' లాంటి వెబ్ సైట్లో ఫోన్ రికార్డు ట్రాక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫోన్ దొంగలించినది అయి ఉండి, దాని ఓనర్ ఫోన్ ను ట్రాకింగ్ లో పెట్టి ఉంటే అది కచ్చితంగా దొంగలింపబడ్డ ఫోన్ అని నిర్ధారించుకోవచ్చు. 4. హార్డ్ వేర్ ను కచ్చితంగా చెక్ చేసుకోవాలి. డేటా ట్రాన్స్ ఫర్ సరిగా అవుతోందా, సిమ్ కార్డులు నెట్ వర్క్ ను సరిగ్గా క్యాచ్ చేస్తున్నాయా? అనే అంశాలను నిర్ధారించుకోవాలి. 5. చేతి నుంచి కాకుండా పేపాల్ లాంటి మాధ్యమాల ద్వారా డబ్బు చెల్లించడం మేలు. 6. ఫేస్ బుక్ లో స్మార్ట్ ఫోన్ ను కొనడం మేలు. ఎందుకంటే, అమ్మేవారి ప్రొఫైల్ అందులో ఉంటుంది కాబట్టి. ఫ్రొఫైల్ ను బట్టి అమ్మేవారి గురించి కొంతైనా తెలుసుకునే వీలుంటుంది. 7. చివరగా మీరు కొనబోయే స్మార్ట్ ఫోన్ కు వారంటీ ఉందా? లేదా? కనుక్కోండి. దీని వల్ల ఫోన్ కు కొంచెం ప్రొటెక్షన్ ఉన్నట్టవుతుంది.

  • Loading...

More Telugu News