: ఛోటా రాజన్ గురించి అండర్ వరల్డ్ వర్గాలు చెబుతున్న విషయాలు ఇవి...
మాఫియా డాన్ ఛోటా రాజన్ ను ఇండోనేషియా పోలీసులు అరెస్ట్ చేసి, విచారిస్తున్న సంగతి తెలిసిందే. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన దావూద్ ఇబ్రహీంతో కలసి తొలుత పనిచేసిన ఛోటా రాజన్... 1990లో దావూద్ తో వచ్చిన విభేదాల వల్ల అతనితో విడిపోయి, సొంత సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ప్రస్తుతం ఛోటా రాజన్ ను భారత్ కు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అండర్ వరల్డ్ వర్గాలు ఛోటా రాజన్ గురించి పలు విషయాలను వెల్లడిస్తున్నాయి. అవేంటో చూద్దాం... * ఛోటా రాజన్ స్వార్థపరుడు, పచ్చి అవకాశవాది. * సొంత గ్యాంగ్ సభ్యులనే అనుమానించేవాడు. సందేహం వస్తే చంపమని ఆదేశించేవాడు. * తన స్థానంలో నాయకుడిగా ఎదిగేందుకు యత్నిస్తున్నాడన్న అనుమానంతో ఓపీ సింగ్ ను నాసిక్ జైల్లో హత్య చేయించాడు. * మోహన్ కొటియన్, బాలా కొటియన్, భరత్ నేపాలి, ఓపీ సింగ్, శామ్యూల్ లను చంపించాడు. * జర్నలిస్ట్ జే డేను కూడా చంపించింది రాజనే. తనకు సంబంధించిన సమాచారాన్ని చోటా షకీల్ కు చేరవేస్తున్నాడన్న అనుమానంతో హత్య చేయించాడు. * ఇతరుల గురించి ఎవరైనా చెడుగా చెబితే... అందులో నిజం ఉందా? లేదా? అని కూడా ఆలోచించే వాడు కాదు. * రాజన్ మూర్ఖుడు. ఏమాత్రం తెలివి లేదు. * ఛోటా రాజన్ కు మిత్రుల కంటే శత్రువులే ఎక్కువయ్యారు. * గ్యాంగ్ స్టర్లు రవి పూజారి, హేమంత్ పూజారి, విజయ్ షెట్టిలు కూడా రాజన్ శత్రువులే.