: కేంద్ర బృందం ముందు బారులు తీరిన ‘గల్లంతు’ ఓటర్లు... ఫిర్యాదులకు టీడీపీ గ్రేటర్ చీఫ్ మాగంటి నేతృత్వం


గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ లో ఓట్లు గల్లంతైన ఓటర్లు నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రం వద్ద బారులు తీరారు. ఉన్నట్టుండి తమ ఓట్లు గల్లంతైన వైనంపై వారంతా కేంద్ర ఎన్నికల కమిషన్ పంపిన అధికార బృందం ముందు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నటిదాకా ఓటర్ల జాబితాలో ఉన్న తమ ఓట్లు రాత్రికి రాత్రే ఎలా గల్లంతవుతాయంటూ వారు ప్రశ్నించారు. ఓట్ల తొలగింపునకు సంబంధించి తమకు ఎలాంటి నోటీసులు కూడా అందలేదని వారు ఫిర్యాదు చేశారు. టీడీపీ గ్రేటర్ చీఫ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నేతృత్వంలో బాధితులంతా కేంద్ర బృందానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందించారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన కేంద్ర బృందం కొద్దిసేపటి క్రితం అఖిలపక్ష నేతలతో సమావేశమైంది.

  • Loading...

More Telugu News