: యూపీ కేబినెట్ లో భారీ షఫిలింగ్...12 మంది కొత్త మంత్రులను చేర్చుకున్న అఖిలేశ్


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తన కేబినెట్ ను సమూలంగా ప్రక్షాళన చేశారు. నిన్నటికి నిన్న ఏకంగా 8 మంది మంత్రులకు ఉద్వాసన పలికిన అఖిలేశ్, నేడు కొత్తగా 12 మందిని తన కేబినెట్ లోకి ఆహ్వానించారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం లక్నోలోని రాజ్ భవన్ లో యూపీ గవర్నర్ రామ్ నాయక్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే, పాత మంత్రుల్లోని తొమ్మిది మంది శాఖల్లో మార్పు చేశారు. 2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకుంటున్న అఖిలేశ్, ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేబినెట్ ను సమూలంగా ప్రక్షాళన చేసినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News