: జానపద గాయకుడి అరెస్టును ఖండించిన కరుణానిధి
తమిళనాడు సీఎం జయలలితకు వ్యతిరేకంగా పాటలు రాసి, పాడిన జానపద గాయకుడు ఎస్.శివదాస్ అలియాస్ కోవన్ అరెస్టును డీఎంకే అధినేత కరుణానిధి ఖండించారు. ఓ గాయకుడిని అరెస్టు చేసిన జయ ప్రభుత్వం ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతోందనడానికి ఇదొక ఉదాహరణ అని ఆరోపించారు. తమిళనాడులోని లిక్కర్ షాపులను మూసివేయాలంటూ రాసిన పాటను తానే పాడుతూ దానిని వీడియో తీసి, శివదాస్ ఆన్ లైన్ లో అప్ లోడ్ చేశారు. ఈ పాటలో 'అమ్మ'ను అవమానించే పదాలున్నాయంటూ శివదాస్ పై కేసు నమోదు చేసిన చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.