: పరీక్షకు చీరలోనే రండి...లేకపోతే వద్దు: ఆర్పీఎస్సీ
సాధారణంగా మహిళల వస్త్రధారణపై ఆంక్షలు ముస్లిం దేశాల్లో ఉంటాయి. తాజాగా రాజస్థాన్ సివిల్ సర్వీస్ కమిషన్ (ఆర్పీఎస్సీ) కూడా అలాంటి ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 31న రాజస్థాన్ లో నిర్వహించనున్న సివిల్ సర్వీస్ పరీక్షకు అమ్మాయిలు చీర లేదా సల్వార్ సూట్ తో హాజరు కావాలని, లేని పక్షంలో పరీక్షకు అనుమతించమని ఆర్పీఎస్సీ స్పష్టం చేసింది. అబ్బాయిలు కూడా హాఫ్ స్లీవ్ చొక్కాలు ధరించాలని, చెప్పులు లేదా శాండిల్స్ ను సాక్సులు లేకుండా ధరించాలని, లేని పక్షంలో పరీక్షకు అనుమతించేంది లేదని ఆర్పీఎస్సీ తెలిపింది. విభిన్న వస్త్రాలతో వచ్చి పరీక్షల్లో అవకతవకలకు పాల్పడుతున్న కేసులు పెరిగిపోవడంతో ఈ నిర్ణయాలు తీసుకున్నామని అధికారులు వెల్లడించారు.