: హైదరాబాద్ లో భూములు కాజేసే ముఠా అరెస్టు


నకిలీ పత్రాలతో భూములను కాజేస్తున్న ముఠా సభ్యులు నలుగురిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన హైదరాబాద్ లో జరిగింది. నిందితులను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నకిలీ దస్తావేజులతో పేదల భూములను ప్లాట్లుగా చేసి ఈ ముఠాసభ్యులు విక్రయిస్తుంటారు. ఈ ముఠాలో మొత్తం 11 మంది సభ్యులున్నారు. హైదరాబాద్ లోని పాతబస్తీ, చాంద్రాయణగుట్ట పరిధిలోని బండ్లగూడ, దాని పరిసర ప్రాంతాల్లో వీరు ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్పారు. నిందితుల నుంచి సుమారు కోటిన్నర విలువ చేసే భూముల నకిలీ దస్తావేజులు, స్టాంపులు, సీపీయూ, ఒక ప్రింటర్, టైప్ రైటర్ లను స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News