: న్యాయస్థానాల్లో తెలుగు అమలుకు నిర్ణయాలు


న్యాయస్థానాల్లో తెలుగు అమలు కోసం అధికార భాషా సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఈ రోజు జరిగిన సదస్సులో కీలక నిర్ణయాలు జరిగాయి. తెలుగు భాషలో న్యాయశాస్త్ర గ్రంథాలు, న్యాయవ్యవస్థలో వినియోగించే పదాలకు తెలుగు సమానార్థకాలు రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే న్యాయస్థానాలలో తెలుగు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని వినియోగించాలని,  తీర్పులను తెలుగులో వెలువరించాలని నిర్ణయాలు జరిగాయి. వీటితో పాటు మరి కొన్ని నిర్ణయాలను కూడా తీసుకున్నారు. వీటి అమలుకు సహకారం అందించాలని ఆంధ్రపదేశ్ జ్యూడీషియల్ అకాడమీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. 

  • Loading...

More Telugu News