: ఢిల్లీలో శ్రీవారి వైభవోత్సవాలు ప్రారంభం


ఢిల్లీలో శ్రీవారి వైభవోత్సవాలకు అంకురార్పరణ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం, స్వర్ణభారత్ ట్రస్టు, జీఎంఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వైభవోత్సవాలకు జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం అంకురార్పరణ జరిగింది. భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఏడుకొండల వెంకటేశ్వరుడికి తిరుమలలో నిత్యం జరిగే సేవలను ఢిల్లీ ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించే నిమిత్తం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంకురార్పణ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, అద్వానీ కుటుంబసభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నవంబర్ 8 వరకు శ్రీవారి వైభవోత్సవాలు అక్కడ జరగనున్నాయి. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ఢిల్లీ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, శ్రీవారి ఆశీస్సులు పొందాలని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం అద్వానీ మాట్లాడుతూ, తిరుపతి శ్రీవారిని ఇక్కడే దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తిరుపతి వెళ్లలేని భక్తుల కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయమన్నారు. ఈ వైభవోత్సవంలో తన కుటుంబమంతా పాల్గొందని ఆయన చెప్పారు. శ్రీవారి వైభవోత్సవాలు నిర్వహిస్తున్న వెంకయ్యనాయుడు, ఆయన కుటుంబానికి ఈ సందర్భంగా అద్వానీ ధన్యవాదాలు తెలిపారు.

  • Loading...

More Telugu News