: రవిశాస్త్రి అనుచిత వ్యాఖ్యలపై బీసీసీఐకి సుధీర్ నాయక్ లేఖ!
పిచ్ క్యూరేటర్ సుధీర్ నాయక్ పై టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి చేసిన వ్యంగ్య వ్యాఖ్యల వ్యవహారం బీసీసీఐకి చేరింది. ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన భారత్-దక్షిణాఫ్రికా చివరి వన్డేలో తనపై చేసిన వ్యాఖ్యలపై నాయక్ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు లేఖ రాశాడు. తనను రవిశాస్త్రితో పాటు కోచింగ్ స్టాప్ మెంబర్ భరత్ అరుణ్ లు అవమానించారంటూ ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని సుధీర్ కోరాడు. తన సహాయకుడిని దూషించడానికి అసలు భరత్ అరుణ్ ఎవరని లేఖలో ప్రశ్నించాడు. అంతేగాక వాంఖడే స్టేడియంలో పిచ్ రూపొందించిన విధానంపై బోర్డుకు వివరించాడు. ఇటువంటి ఘటనలు బీసీసీఐ-ఇతర అసోసియేషన్ ల మధ్య సామరస్య వాతావరణాన్ని పాడు చేస్తాయని పేర్కొన్నాడు.