: నా అవార్డును వెనక్కివ్వాలనుకోవడంలేదు: బాలీవుడ్ నటి విద్యా బాలన్
రచయితలపై దాడులను నిరసిస్తూ, దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు తమ అవార్డులను ప్రభుత్వానికి తిరిగిచ్చివేస్తుండగా బాలీవుడ్ నటి విద్యా బాలన్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. తనకు లభించిన జాతీయ అవార్డును వెనక్కివ్వనని స్పష్టం చేశారు. ముంబయిలో జరిగిన ఇండియా టుడే కంక్లేవ్ లో విద్యా మాట్లాడుతూ, "ఉత్తమ నటిగా ఈ గౌరవం (పురస్కారం) నాకు దేశం ఇచ్చింది గానీ, ప్రభుత్వం కాదు. అందుకే నా అవార్డును తిరిగిచ్చేయాలనుకోవడం లేదు" అని తెలిపింది. 'ద డర్టీ పిక్చర్' చిత్రంలో తన నటనకుగాను 2012లో విద్యాబాలన్ కు ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం లభించింది.