: జైట్లీ వ్యాఖ్యలు పరోక్షంగా ఏపీకి హోదా ఇవ్వబోమన్నట్టు ఉన్నాయి: జ్యోతుల నెహ్రూ


ప్రత్యేక హోదాల శకం ముగిసిందంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. అలా అనడం పచ్చి మోసమన్నారు. జైట్లీ వ్యాఖ్యలు చూస్తుంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమన్నట్టు ఉన్నాయని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనుమానం వ్యక్తం చేశారు. హోదాకు, 14వ ఆర్థిక సంఘానికి ముడిపెట్టడం సరికాదని, దానిపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రానికి సూచన చేశారు. హోదా కోసం ఇటు ఏపీ ప్రజలు ప్రాణత్యాగాలు చేసుకుంటున్నా సీఎం చంద్రబాబులో ఏ మాత్రం మార్పు లేదని ఆరోపించారు.

  • Loading...

More Telugu News