: నరేంద్ర మోదీకి మూడీస్ హెచ్చరిక!


బీజేపీ నేతలను కట్టడి చేయడంలో విఫలమైతే ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని కోల్పోవలసి వస్తుందని ప్రముఖ రీసెర్చ్ సంస్థ మూడీస్ భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి హెచ్చరించింది. కేవలం మోదీని చూసి బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారని, ఇప్పుడు ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మోదీ ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయని మూడీస్ అనలిటిక్స్ "ఇండియా ఔట్ లుక్: సెర్చింగ్ ఫర్ పొటన్షియల్" పేరిట విడుదల చేసిన రిపోర్టులో అభిప్రాయపడింది. ఈ విషయమై మోదీ తక్షణం స్పందించి, తన పార్టీ నేతలను అదుపు చేయాలని, లేకుంటే ఇండియాతో పాటు ప్రపంచ దేశాల్లోనూ గౌరవాన్ని పోగొట్టుకున్న వారవుతారని, తద్వారా బీజేపీకి భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు తప్పవని తెలిపింది. సెప్టెంబర్ త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి 7.3 శాతంగా ఉండవచ్చని, పూర్తి ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఇంకొంత మెరుగుపడి 7.6 శాతం వృద్ధికి ఇండియా చేరుకోవచ్చని అంచనా వేసింది. భూసేకరణ బిల్లు, జీఎస్టీ వంటి సంస్కరణల అమలులో మోదీ సర్కారు ముందడుగు వేస్తే, జీడీపీ పెరుగుతుందని వివరించింది.

  • Loading...

More Telugu News