: అగ్రిగోల్డ్ ఆస్తులను కొనుగోలు చేసిన ఏపీ మంత్రి ప్రత్తిపాటి భార్య... పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చిక్కుల్లో పడ్డారు. ఆయన భార్య వెంకాయమ్మకు అగ్రిగోల్డ్ గ్రూప్ 14 ఎకరాలను రూ. 10 కోట్లకు విక్రయించిందని ఆరోపిస్తూ, వెంటనే విచారణ జరిపించాలని తెలంగాణ అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ డబ్బును రికవరీ చేయించాలని ఆయన న్యాయమూర్తిని కోరారు. దీనిపై స్పందించి, పిటిషన్ ను విచారణకు స్వీకరించిన జస్టిస్ దిలీప్ బి భోంస్లే, జస్టిస్ ఎస్వి భట్ లతో కూడిన ధర్మాసనం, రెండు వారాల్లో తమ నిర్ణయం తెలియజేస్తామని ప్రకటించింది. కాగా, అగ్రిగోల్డ్ ఆస్తులను విక్రయించి, ఆ సొమ్మును జమచేసేందుకు హైకోర్టు రిజిస్ట్రార్ పేరిట ఇప్పటికే ఖాతాను ప్రారంభించిన సంగతి తెలిసిందే.