: నలుగురు యువతుల ప్రాణం తీసిన గ్రానైట్ రాళ్లు!


ఈ ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు యువతులు గ్రానైట్ రాళ్ల మధ్య నలిగి మరణించారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా వెంకటాచలం సమీపంలోని చెముడుగుంట వద్ద జరిగింది. లారీలో గ్రానైట్ రాళ్లను తరలిస్తుండగా, వాటిపై కూర్చుని పలువురు మహిళా కూలీలు ప్రయాణిస్తుండగా, లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా ప్రకాశం జిల్లా మార్టూరు సమీపంలోని చిన జాగర్లమూడి గ్రామానికి చెందిన వారని సమాచారం.

  • Loading...

More Telugu News