: బీహార్ లో బీజేపీ ఓడితే...పాక్ లో పటాసులు పేలతాయి: అమిత్ షా సంచలన వ్యాఖ్య
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైతే, పాకిస్థాన్ లో పటాసులు పేలతాయని ఆయన వ్యాఖ్యానించారు. మోతిహరి పరిధిలోని రాక్సాల్ లో నిన్న జరిగిన ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. బీహార్ లో బీజేపీ ఓడిపోయి, మహా కూటమి విజయం సాధిస్తే రాజకీయ నేతగా మారిన షహబుద్దీన్ లాంటి నేరగాళ్లు కూడా టపాసులు పేల్చుకుని సంబరాలు చేసుకుంటారని కూడా అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలనకు చెక్ పెట్టేందుకు ప్రజలంతా విజ్ఞతతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అమిత్ షా పిలుపునిచ్చారు.