: కాలేజీ క్యాంపస్ లో పులి... భయంతోనే తెగ ఫోటోలు తీసుకున్న యువత!
కాలేజీలోకి పెద్ద పులి వచ్చింది. ఓ వైపు భయం, మరోవైపు ఆ పులిని ఫోటోలు తీయాలన్న యువ మనసు. ఏదైతేనేం, మధ్యప్రదేశ్ లోని భోపాల్ సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజీ యువత పెద్దపులిని ఫోటోలు తీశారు. అటవీ శాఖ అధికారులు వచ్చి ఆరు గంటల పాటు శ్రమించి పులికి మత్తు మందు ఉన్న ఇంజక్షన్ ఇచ్చి దాన్ని బంధించేంత వరకూ విద్యార్థులు తమ మొబైల్ ఫోన్లతో పులిని వెంబడించారు. ఆ చిత్రాలన్నీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ పులిని 'వన్ విహార్' జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి అప్పగిస్తామని రాష్ట ప్రభుత్వ అధికారులు తెలిపారు.