: ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్ కుమారుడి కన్నుమూత
ప్రముఖ తమిళ హాస్య నటుడు, పలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రజలకు సుపరిచితుడైన వివేక్ కుమారుడు ప్రసన్న కుమార్ (13) తీవ్ర అనారోగ్యంతో మరణించడంతో ఆయన కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. గడచిన నెల రోజులకు పైగా ప్రసన్నను బ్రెయిన్ ఫీవర్ పీడిస్తోంది. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న ప్రసన్న, కోలుకోలేక మరణించాడు. వివేక్ కుమారుడి మరణ వార్తతో అటు తమిళ, ఇటు తెలుగు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపాన్ని తెలిపారు. ఎప్పుడూ తన హాస్యంతో అందరినీ అలరించే వివేక్, కుమారుడి మృతిని తట్టుకోలేక బోరున విలపించడం పలువురిని కదిలించింది.