: గంటా, నారాయణలు ఇక వియ్యంకులు... నేటి పెళ్లికి హాజరుకానున్న చంద్రబాబు


ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ నేటి నుంచి వియ్యంకులుగా మారనున్నారు. నిన్నటిదాకా టీడీపీలో నేతలుగా వీరిద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నప్పటికీ బంధుత్వం మాత్రం లేదు. అయితే నారాయణ కూతురు, గంటా కొడుకుల మధ్య పెళ్లితో వీరి మధ్య కొత్తగా బంధుత్వం ఏర్పడనుంది. నేటి నుంచి వీరిద్దరూ వియ్యంకులుగా మారిపోనున్నారు. నారాయణ కూతురు శరణి, గంటా కుమారుడు రవితేజల వివాహం నేడు నెల్లూరులో అంగరంగవైభవంగా జరగనుంది. నేడు నెల్లూరు జిల్లా పర్యటనకు వెళుతున్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకున్న తర్వాత నారాయణ ఇంట జరిగే వివాహ కార్యక్రమానికి హాజరుకానున్నారు. నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించనున్నారు. ఈ కార్యానికి టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News