: 6న సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్
సింగరేణి కార్మికులకు నవంబర్ 6న దీపావళి బోనస్‌ను చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. ఈ విషయాన్ని గుర్తింపు కార్మిక సంఘం టీఆర్‌ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆకునూరి కనకరాజు తెలిపారు. ఇక్కడి సింగరేణి ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్ తో సంప్రదింపులు జరిగాయన్నారు. అనంతరం దీపావళి బోనస్‌ను నవంబర్ ఆరో తేదీన బ్యాంకుల ద్వారా చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించిందని చెప్పారు. సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ను రూ. 48,500 చొప్పున చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించిన విషయం తెలిసిందే.