: గులాం అలీ ప్రదర్శన ఇస్తానంటే భద్రత కల్పిస్తాం: ఫడ్నవీస్
పాకిస్థాన్ గాయకుడు గులాం అలీ ముంబైలో ప్రదర్శన ఇస్తానంటే అతనికి భద్రత కల్పించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ముంబైలో ఆయన మాట్లాడుతూ, కళలకు ప్రాంతం, మతం, భాషా భేదాలు ఉండవని అన్నారు. కలలకు ఎల్లలు లేవని, కళాకారుల్లో ప్రతిభను చూడాలే తప్ప వారు ఏ ప్రాంతానికి, మతానికి, కులానికి, భాషకు చెందిన వ్యక్తి అని చూడకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. గులాం అలీ ప్రదర్శన ముంబైలో రద్దవడం బాధాకరమని అన్న ఆయన, గులాం అలీ ఇప్పటికీ ముంబైలో ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటే కనుక భద్రత కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. కాగా, గులాం అలీ ప్రదర్శనపై శివసేన హెచ్చరికలు చేయడంతో కచేరీ రద్దైన సంగతి తెలిసిందే.