: వరంగల్ ఉపఎన్నికకు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి తొలి నామినేషన్
వరంగల్ లోక్ సభ ఉపఎన్నికకు తొలి నామినేషన్ దాఖలైంది. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బి.సమ్మయ్య అనే వ్యక్తి నామినేషన్ దాఖలు చేశారు. ఓ వైపు అభ్యర్థిని ఖరారు చేసే విషయంలో ప్రస్తుతం కాంగ్రెస్ నేతలతో దిగ్విజయ్ సింగ్ చర్చిస్తుంటే ఈలోగా రెబల్ అభ్యర్థిగా నామినేషన్ పడటం గమానార్హం. వరంగల్ సీటు ఎలాగైనా గెలిచి తీరుతామనుకుంటున్న కాంగ్రెస్ కు సమ్మయ్య రూపంలో ఎదురుదెబ్బ తగిలే అవకాశం లేకపోలేదు. ఇదిలాఉంటే, తెలంగాణలో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ-టీడీపీలు కూడా ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదు. మరోవైపు పార్టీ కార్యాలయంలో నేతలతో సీఎం కేసీఆర్ కూడా సమాలోచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లు రేపు ప్రకటించే అవకాశం ఉంది.