: పెరిగిన బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ అద్దెలు... తగ్గిన ఉచిత కాల్స్ సంఖ్య


భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఇంటర్నెట్ అద్దెలు పెరిగాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ అద్దెలు పెంచినట్టు బీఎస్ఎన్ఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. పెరిగిన అద్దెలు నవంబర్ నుంచి అమల్లోకి రానున్నట్టు చెప్పింది. ఇదే సమయంలో తాము అందించే ఉచిత కాల్స్ సంఖ్య తగ్గించినట్టు వెల్లడించింది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి లైన్ల సామర్థ్యం కలిగిన ఎక్చేంజ్ ల పరిధిలో రూ.120గా ఉన్న అద్దెను రూ.140కు పెంచారు. నెట్ ఉచిత కాల్స్ 120 నుంచి 70కు తగ్గాయి. 3వేల లైన్ల సామర్థ్యం కలిగిన ప్రాంతాల్లో అద్దెను రూ.140 నుంచి రూ.160కి పెంచి, ఉచిత కాల్స్ ను 140 నుంచి 75కు బీఎస్ఎన్ఎల్ కుదించింది. ఇక పట్టణాల్లో రూ.160గా ఉన్న అద్దెను రూ.180కు పెంచి ఉచిత కాల్స్ ను 160 నుంచి 90కు తగ్గించింది.

  • Loading...

More Telugu News