: నేడు వరల్డ్ స్ట్రోక్ డే... రిస్క్ తగ్గించుకునేందుకు సింపుల్ టిప్స్!
పక్షవాతం (స్ట్రోక్) ... శరీరంలోని అవయవాలను పనిచేయకుండా చేస్తుంది. డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం ప్రతి ఏటా 1.70 కోట్ల మంది పక్షవాతం, గుండెపోటు వంటి జబ్బులకు గురవుతున్నారు. పక్షవాతం వచ్చిన వారిలో 30 లక్షల మంది మహిళలు, 25 లక్షల మంది పురుషులు మృత్యువాత పడుతున్నారు. నేడు వరల్డ్ 'స్ట్రోక్ డే'. మెదడులోని ఓ ప్రాంతానికి రక్తాన్ని చేర్చే నాళాలు మూసుకుపోవడంతో 'స్ట్రోక్' వస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా పక్షవాతానికి దూరం కావచ్చంటున్నారు వైద్య నిపుణులు. * తీసుకునే ఆహారం శరీరానికి ఆరోగ్యాన్ని కలిగించేదిగా ఉండాలి. ఎక్కువ పండ్లు, కూరగాయలు, సోడియం (ఉప్పు) తక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి. కొవ్వును కలిగించే వాటికి దూరంగా ఉండాలి. * బరువు పెరగకుండా జాగ్రత్త పడాలి. బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) అదుపు తప్పుతుందంటే, స్ట్రోక్ కు దగ్గరవుతున్నట్టే. * కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రజర్ స్థాయి ఎప్పుడూ నియంత్రణలో ఉండాలి. బీపీ 120/80 ఉండేలా చూసుకోవాలి. * మద్యపానం, ధూమపానం అసలొద్దు. ఈ రెండూ స్ట్రోక్ ను శరవేగంగా దగ్గర చేస్తాయి. రోజుకు రెండు పెగ్గులు మద్యం సేవించే పురుషులకు, ఒక పెగ్గు మద్యం సేవించే స్త్రీలకు ఇతరులతో పోలిస్తే స్ట్రోక్ త్వరగా వస్తుంది. * శరీరానికి చాలినంత విశ్రాంతిని ఇవ్వాలి. ఇందుకోసం అలసట తీరేంతగా నిద్ర పోతే సరిపోతుంది. ఇలా అలవాట్లను మార్చుకోవడం, దురలవాట్లకు దూరం కావడంతో పాటు మానసికంగా ఆహ్లాదంగా ఉంటే ఈ ప్రాణాంతక 'స్ట్రోక్' దరిచేరదు.